విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవం : సీపీ
విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవం : సీపీ | గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవమని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అమరావతి : గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవమని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరాయిన్ గుజరాత్ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి హెరాయిన్ వెళ్తోందని పేర్కొన్నారు. ఆషీ కంపెనీ లైసెన్స్‌లో చిరునామా విజయవాడ పేరిట ఉందని పేర్కొన్నారు. విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరుగడం లేదని స్పష్టం చేశారు. చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని పేర్కొన్నారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని సుధాకర్ చాలా రోజుల కిందటనే చెన్నైలో స్థిరపడ్డారని వివరించారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 15న ముంద్రా పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శరీర సౌందర్యానికి వాడే టాల్కమ్ పౌడర్ ముసుగులో అఫ్గానిస్థాన్ నుంచి ముంద్రా పోర్టుకు స్మగ్లింగ్ చేసినట్టు సమాచారం అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చిరునామాతో ఉన్న ఆషీ సంస్థ పేరిట దిగుమతి చేసుకున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ రవాణాపై డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

