Coffee Caye | గారెత్ జాన్సన్, మార్షల్ మేయర్.. ఇద్దరికీ సొంతంగా ఏదైనా దీవిని కొనాలని కల. డబ్బుల్లేవు. కానీ వారు వెనకడుగు వేయలేదు. లెట్స్ బై ఐల్యాండ్ అంటూ 2018లో క్రౌడ్ ఫండింగ్ ( Crowd funding ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాదిలోనే చందాల ద్వారా 2.5 కోట్లు పోగు చేశారు. ఆ డబ్బుతో కరీబియన్ దీవుల్లో ( Caribbean Island ) కాఫీ కేయ్ ( Coffee Caye ) అనే దీవిని కొనుగోలు చేశారు. ఆ దీవి ఇదే. సెంట్రల్ అమెరికాలోని బెలీజ్ దేశ తీరంలో ఈ దీవి ఉన్నది. దీన్ని ప్రత్యేక దేశంగా మార్చాలని గారెత్ జాన్సన్, మార్షల్ మేయర్ భావిస్తున్నారు. ఇప్పటికే దీని కోసం ప్రత్యేక జెండా, జాతీయ గీతం రూపొందించారు.