ఈ ఇల్లు.. ప్రకృతి పొదరిల్లు

ప్రకృతి అంటే ఇష్టపడే ఆ దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల మొక్కలతో ఆ ఇంటిని ఆహ్లాదకరంగా తయారు చేశారు. ప్రకృతి తోడుండే ప్రతి ఇల్లు స్వర్గధామమే అన్నట్లుగా ఈ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మారుమూల గ్రామమైన శంభునిగూడెంకు చెందిన అరుణ్‌కుమార్, సువార్త దంపతులు సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి తమ ఇంటి పరిసరాల్లో పలు రకాల మొక్కలను పెంచుతున్నారు.

భార్య సువార్తకు మొక్కలన్నా, వాటిని పెంచడమన్న చాలా ఇష్టం. భర్త అరుణ్‌కుమార్ సహకారం, కుమారుడు దిలీప్‌కుమార్ చేదోడువాదుడుగా నిలువడంతో మొక్కలను సేకరించి ప్లాస్టిక్ కుండీలు, కుండలు, గాజు పాత్రల్లో పెంచుతున్నారు. అంతేకాకుండా పెంచుతున్న తీగజాతి మొక్కలు ఇంటి షెడ్డుకు అల్లుకొని పెరుగుతుండడంతో ఇల్లు ఆకర్షణీయంగా మారింది. ఇంటి పరిసరాలు మొక్కలు, పూలతో సువాసన వెదజల్లుతూ చల్లటి వాతావరణం ఇస్తున్నాయి. పూల మొక్కలే కాకుండా బొప్పాయి, కూర అరటి, అరటి, బంగాళ దుంప, చేమ గడ్డలు,కంద గడ్డలు, మిరపకాయలు, తోటకూర, పుదీన, కొత్తిమీర, పాలకూర, బచ్చలకూర లాంటి మొక్కలను వేసి సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు వాళ్లు వాడుకోవడమే కాకుండా గ్రామస్తులకు సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలు కొనడమే తమకు తెలియదంటూ ఆ దంపతులు చెప్తుంటే తెలుస్తోంది ప్రకృతికి వారు ఎంత దగ్గరయ్యారో..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
Chamala Kiran Kumar Reddy | కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలా.. కాంగ్రెస్ ఎంపీ చామల అజ్ఞానం బట్టబయలు
Tummidihatti | తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం.. మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి!
Eenadu | చెంపలేసుకున్న ఈనాడు పత్రిక.. కేటీఆర్‌కు క్షమాపణ.. తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
Tummidihatti | తమ్మిడిహట్టి పాట.. రేవంత్ తొండాట.. ఏదీ తేలకున్నా ఏదో సాధించినట్టు కాంగ్రెస్ గొప్పలెందుకు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

