Hitech panchayati | హైటెక్ హంగులతో కనిపిస్తున్న ఈ భవనం నగరంలోని ఏ కార్పొరేట్ ఆఫీసో అని అనుకొంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామ పంచాయతీ భవనం. రూ. 30 లక్షలతో కార్పొరేట్ హంగులతో నిర్మించిన ఈ పంచాయతీ భవనం చూపరులను ఆకట్టుకొంటుంది.