మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా?.. ప్రశ్నించిన అహ్మదాబాద్ హైకోర్టు
ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున...
అహ్మదాబాద్ : ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున కేవలం కబేళాను తాత్కాలికంగా మూసివేశారని హైకోర్టు అభిప్రాయపడింది.
కుల్‌హింద్ జమియాత్ అల్ ఖురేష్ యాక్షన్ కమిటీ ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు విచారించింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల ఆహార హక్కును నిరోధించడమే అని పిటిషన్‌దారు డాక్టర్ ఖురేషీ రజావాలా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సందీప్ భట్.. ‘ఒకటి రెండు రోజుల పాటు మాంసం తినకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవచ్చు..’ అని సూచించారు. తమను తాము నిగ్రహించుకోవడం గురించి కాదని, ప్రాథమిక హక్కులకు సంబంధించినది అని పిటిషనర్ వాదించారు. కబేళాను పూర్తిగా మూసివేయలేదని, ఓ నాలుగు రోజులు మాంసం విక్రయాలపై తాత్కాళికంగా నిషేధం విధించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోర్టుకు విన్నవించింది. పండుగల దృష్ట్యా ఈ నెల 24, 31 తేదీలతో పాటు వచ్చే నెల 4, 9 తేదీల్లో నగరంలో ఉన్న ఏకైక కబేళాను మూసిఉంచాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

