ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడో తెలుసా?
World tallest Shiva statue | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పరమశివుడి విగ్రహం రూపుదిద్దుకుంది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషితో కలిసి
World tallest Shiva statue | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పరమశివుడి విగ్రహం రూపుదిద్దుకుంది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషితో కలిసి ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ‘విశ్వాస్ స్వరూపం’ అని విగ్రహ స్థాపకులు నామకరణం చేశారు. ఈ సందర్భంగా దాదాపు పదేళ్లపాటు శ్రమించి విగ్రహాన్ని నిర్మించిన నిర్వాహకులను అశోక్ గెహ్లాట్ అభినందించారు. ఉదయ్‌పూర్ నగరానికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహాన్ని తత్పదం సంస్థాన్ నిర్మించింది.
కొండపై ధ్యానం చేస్తున్న భంగిమలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు విగ్రహం కనిపించనున్నది. రాత్రి సమయంలో విద్యుద్దీప కాంతుల్లోనూ విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, విగ్రహ నిర్మాణానికి దాదాపు పది సంవత్సరాల సమయం పట్టగా.. నిర్మాణంలో 3వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్‌ను వినియోగించారు. 2012 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్, మొరారీ బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

