Uttar Pradesh | గన్‌తో బెదిరించి.. దుస్తులు మార్చుకుంటున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన సెక్యూరిటీ గార్డు
సెక్యూరిటీ గార్డు బలవంతంగా డ్రెస్ చేంజ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న తుపాకీతో ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని అతడు బెదిరించాడు.
లక్నో: ఒక మాల్లో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డు దారుణానికి పాల్పడ్డాడు. అందులో క్లీనింగ్ పని చేసే మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఆ గదిలోకి వెళ్లి గన్‌తో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో ఇద్దరు వ్యక్తులు దీనికి సహకరించారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ రోడ్లో ఉన్న పీవీఆర్ మాల్లో ఒక మహిళ హౌస్ కీపింగ్ పని చేస్తున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆ మహిళ విధుల అనంతరం ఆ మాల్లోని గదిలో దుస్తులు మార్చుకుంటున్నది. అయితే అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డు బలవంతంగా డ్రెస్ చేంజ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న తుపాకీతో ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని అతడు బెదిరించాడు. మాల్ సూపర్వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తి ఆ సమయంలో ఆ గది బయట కాపాలాగా ఉండి నిందితుడికి అండగా ఉన్నారు.
కాగా, ఈ సంఘటన అనంతరం బాధిత మహిళ ఆ మాల్లో పని మానేసింది. కొన్ని రోజులుగా ఆమె మౌనంగా ఉండటంతో ఏం జరిగిందన్న దానిపై భర్త ఆరా తీశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని తెలియడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడైన సెక్యూరిటీ గార్డుతోపాటు అతడికి సహకరించిన మాల్ సూపర్వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీస్ అధికారి తెలిపారు.
Navjot Singh Sidhu | జైలు నుంచి విడుదలైన సిద్ధూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మండిపాటు
Rahul Gandhi | రాహుల్‌పై మరో పరువునష్టం కేసు.. ‘కౌరవ’ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

