Honeymoon | హనీమూన్ ట్రిప్.. గోవాకు బదులుగా అయోధ్యకు.. విడాకులు కోరిన భార్య
Honeymoon | ఓ భర్త తన భార్యను హనీమూన్‌కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో తన భర్త నుంచి భార్య విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగు చూసింది.
Honeymoon | భోపాల్ : ఓ భర్త తన భార్యను హనీమూన్‌కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో తన భర్త నుంచి భార్య విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఐటీ రంగంలో పని చేస్తున్నాడు. సంపాదన కూడా బాగానే ఉంది. అయితే హనీమూన్‌కు విదేశాలకు వెళ్దామని భర్తను భార్య కోరింది. కానీ తన తల్లిదండ్రులను చూసుకునే వారు లేరని, ఇండియాలోనే ఏదైనా ప్రదేశానికి వెళ్దామని భర్త చెప్పాడు. దీంతో గోవాకు వెళ్దామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
కానీ భర్త సడెన్‌గా తన ప్లాన్ మార్చాడు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లాలని కుమారుడిని తల్లి కోరింది. దీంతో అతను అయోధ్యకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. ఇక చేసేదేమీ లేక భార్య తన భర్త వెంట వెళ్లింది. అయోధ్య, వారణాసి ట్రిప్ ముగిశాక భార్యాభర్తలిద్దరూ ఇంటికి తిరిగొచ్చారు.
హనీమూన్ ట్రిప్ గోవాకు బదులుగా అయోధ్య, వారణాసికి మారడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ శుక్రవారం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక తన కంటే కుటుంబ సభ్యులకే తన భర్త అధిక ప్రాధాన్యత ఇస్తాడని భార్య పిటిషన్లో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya
- divorce
- family court
- Goa
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

