Pragya Singh Thakur | యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ.. ఆ తర్వాత ముస్లిం ప్రియుడితో కలిసి ఆమె పరార్
Pragya Thakur | వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్ స్కూల్లో చదువుతున్నది. ముస్లిం క్లాస్మేట్ అయిన స్నేహితురాలి సోదరుడు యూసుఫ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మే 11న ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రులు బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (Pragya Singh Thakur) సహాయం కోరారు. దీంతో పోలీసులు చివరకు ఆ యువతిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
కాగా, బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ గత నెలలో ఆ యువతితో సహా మరి కొందరికి వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను చూపించారు. ఆ యువతులతో కలిసి ఆమె కూడా ఆ సినిమాను చూశారు. అయితే మే 15న ఆ యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను యూసఫ్ ఖాన్ ట్రాప్ చేసి తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతడికి నేర చరిత్ర ఉందని ఆరోపించారు.
మరోవైపు మే 30న తమ కుమార్తెకు మరో యువకుడితో పెళ్లి జరుగాల్సి ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లి కోసం ఉంచిన రూ.70,000 నగదు, బంగారు నగలు కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లు ఆరోపించారు. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని విమర్శించారు. కాగా, ఆ యువతి ఒక వీడియోను విడుదల చేసింది. తాను మేజర్ అని, తెలిసిన వ్యక్తిని ప్రేమించినట్లు అందులో పేర్కొంది.
అయితే తన కుమారుడ్ని ఇంటి నుంచి వెళ్లగొట్టానని, అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని యూసఫ్ ఖాన్ తండ్రి చెప్పాడు. విడిపోదామని తన సోదరుడు చెప్పినప్పటికీ స్నేహితురాలు బలవంతం చేసి పారిపోయేందుకు ప్రేరేపించిదని యూసఫ్ సోదరి ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

