బిడ్డ తలపై రుబ్బురాయితో కొట్టిచంపిన తల్లి..!
Woman murdered her daughter: తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 47 ఏండ్ల మహిళ తన బిడ్డను తలపై రుబ్బురాయితో కొట్టిచంపింది.

కోయింబత్తూర్: తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 47 ఏండ్ల మహిళ తన బిడ్డను తలపై రుబ్బురాయితో కొట్టిచంపింది. కోయింబత్తూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని కరమదాయ్ ఏరియాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగమణి అనే 47 ఏండ్ల మహిళకు మహాలక్ష్మి అనే ఒక కుమార్తె ఉన్నది. అయితే ఇటీవల ఆమె భర్త చనిపోవడంతో బిడ్డ, కొడుకుతో కలిసి తల్లి దగ్గరే ఉంటున్నది. ఈ క్రమంలో మహాలక్ష్మి గంటల తరబడి వేరే వ్యక్తితో మాట్లాడుతుండటంపై ఇంట్లో తల్లీబిడ్డకు గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లలను పట్టించుకోవడం లేదంటూ నాగమణి తరచూ మహాలక్ష్మిని మందలిస్తూ వచ్చింది.
అయినా మహాలక్ష్మి తల్లి మాటలను పెడచెవిన పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా తల్లీబిడ్డల మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ మద్యం సేవించి గొడవపడ్డారు. తర్వాత నిద్రలోకి జారుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన నాగమణి రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకుంది. ఇంట్లో ఉన్న రుబ్బురాయి తీసుకుని గాఢ నిద్రలో ఉన్న కుమార్తె తలపై బలంగా మోదింది. దాంతో మహాలక్ష్మి తలపగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

