బాలుడ్ని లైంగికంగా వేధిస్తున్న మహిళ.. పేరెంట్స్ ఫిర్యాదుతో ఆమె అరెస్ట్
15 ఏళ్ల బాలుడి కుటుంబంతో కలిసి 32 ఏళ్ల మహిళ కొంతకాలం ఉన్నది. ఈ సందర్భంగా అతడ్ని ఆకట్టుకుని లైంగిక చర్యలకు పాల్పడింది. ఆ బాలుడికి ఖరీదైన మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది.
ముంబై: ఒక మహిళ మైనర్ బాలుడ్ని లైంగికంగా వేధిస్తున్నది. అతడితో లైంగిక చర్యలకు పాల్పడుతున్నది. ఈ విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడి కుటుంబంతో కలిసి 32 ఏళ్ల మహిళ కొంతకాలం ఉన్నది. ఈ సందర్భంగా అతడ్ని ఆకట్టుకుని లైంగిక చర్యలకు పాల్పడింది. ఆ బాలుడికి ఖరీదైన మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది.
మరోవైపు కుమారుడిలో మార్పు, ప్రవర్తనను అతడి తల్లిదండ్రులు గమనించారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని స్కూల్ టీచర్‌ను కోరారు. ఆ టీచర్ అడగడంతో ఆ బాలుడు అసలు విషయం చెప్పాడు. బంధువైన మహిళతో లైంగిక సంబంధం ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆ మహిళను హెచ్చరించారు. తమ కుమారుడికి దూరంగా ఉండాలని చెప్పారు.
అయినప్పటికీ ఆ మహిళ బాలుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నది. తన ఇంటికి అతడ్ని పిలిపిస్తున్నది. దీంతో బాలుడి పేరెంట్స్ చివరకు పోలీసులను సోమవారం ఆశ్రయించారు. దీని గురించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను నాసిక్‌లో అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

