ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటా ఓట్ల కంటే తక్కువ మెజార్టీ
నోటా | ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు మాత్రం నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ మెజార్టీ వచ్చింది. అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగి

న్యూఢిల్లీ : ఏ ఎన్నికలోనైనా ఏ పార్టీ అభ్యర్థులైనా.. తాము భారీ మెజార్టీతో గెలవాలని కలలు కంటారు. అందుకు తగ్గ కృషి చేస్తుంటారు. ఎన్నో జిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. కానీ కొంత మంది నాయకులకు ఎలాంటి అనుకూలతలు లేకపోయినా.. భారీ మెజార్టీ వస్తోంది. మరి కొంతమంది నాయకులకు అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో గెలుస్తుంటారు. కానీ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు మాత్రం నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ మెజార్టీ వచ్చింది.
అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే నజీరా, బర్హంపూర్, బిజ్ని, దూధ్నోయి, టియోక్ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు స్వల్ప ఓట్ల తేడాతో ప్రత్యర్థులపై గెలిచారు. వీరికి వచ్చిన మెజార్టీ నోటా ఓట్ల కంటే తక్కువ.
నజీరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేబబ్రాటా సైకియా.. బీజేపీ అభ్యర్థి మయూర్‌పై 683 ఓట్లతో గెలిచారు. ఇక్కడ నోటాకు పోలైన ఓట్లు 1470.
బర్హంపూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. బీజేపీ అభ్యర్థి జితూ గోస్వామి.. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ బోరాపై 751 ఓట్ల తేడాతో గెలిచారు. 1291 ఓట్లు నోటాకు వచ్చాయి.
బిజ్నీ నియోజకవర్గంలో బీపీఎఫ్ అభ్యర్థి కమల్ సింగ్.. బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ రాయ్ చేతిలో ఓడిపోయారు. రాయ్ 1,003 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో నోటాకు పోలైన ఓట్లు 1388.
టియోక్ నియోజకవర్గంలో ఏజీపీ అభ్యర్థి రీనూపూమ రాజ్కోవా 1350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నోటాకు ఇక్కడ 1927 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా నోటాకు 2,19,578 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

