Raghava Lawrence | రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. సీఎం విజయ్ వదులుకున్న స్థానం నుంచి బరిలోకి..!
Raghava Lawrence | ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) రాజకీయ అరంగేట్రంపై తమిళనాట జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున ఆయన తిరుచ్చి ఈస్ట్ (Tricchi East) అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి.
Raghava Lawrence : ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) రాజకీయ అరంగేట్రంపై తమిళనాట జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున ఆయన తిరుచ్చి ఈస్ట్ (Tricchi East) అసెంబ్లీ ఉపఎన్నిక (Assembly Bye Elections) లో పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన లారెన్స్.. తన భవిష్యత్తుకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని జూన్ 11న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ స్పందన ద్వారా ఉత్కంఠను మరింత పెంచారు.
తమిళనాడు (Tamil Nadu) లోని ‘తిరుచ్చి ఈస్ట్’ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. సీఎం విజయ్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతారని వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియా ఛానెళ్లలోనూ ఇదే అంశంపై చర్చ జరగడంతో లారెన్స్ రాజకీయ ప్రవేశం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ వార్తలు శ్రుతిమించడంతో రాఘవ లారెన్స్ స్వయంగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘గత కొన్ని రోజులుగా తాను తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ కోసం మీడియా మిత్రులు నన్ను సంప్రదిస్తున్నారు. ఈ ఊహాగానాలకు తెరదించడానికే ఈ ప్రకటన చేస్తున్నాను’ అని ఆయన తన నోట్లో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సమర్పణలో వస్తున్న ‘బెంజ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఆ షెడ్యూల్ జూన్ 10తో ముగుస్తుందని స్పష్టంచేశారు. తన ప్రకటనకు ముగింపు ఇస్తూ లారెన్స్ మరింత ఆసక్తిని రేకెత్తించారు. ‘షూటింగ్ పూర్తయిన మరుసటి రోజు అంటే జూన్ 11న గురువారం ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తా’ అని వెల్లడించారు.
అయితే రాఘవ లారెన్స్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా..? వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించే ప్రకటన చేస్తారా..? లేదంటే మరేదైనా కొత్త విషయం ప్రకటిస్తారా..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జూన్ 11 వరకు ఆగాల్సిందే. ఆయన ప్రకటన కోసం అభిమానులు, రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

