వారిద్దరూ హై ప్రొఫైల్ దంపతులు… ఇద్దరూ బాగానే సంపాదిస్తున్నారు.. అంతా బాగానే ఉంది. అంతలో ఇద్దరి మద్య మనస్పర్థలు గొడవలకు దారితీశాయి. దీంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. మధ్యలో పసివాడు ఏం పాపం చేశాడు. కొడుకును వారానికి ఒక సారి కలుసుకునే వెసులుబాటు కోర్టు తండ్రికి ఇవ్వడం ఆ తల్లికి నచ్చలేదేమో. భర్త తరచూ కొడుకును చూసేందుకు రావటం ఆమె సహించ లేక పోయింది. ఎలాగైనా భర్త నుంచి కొడుకును దూరం చేయాలనే పిచ్చితనంతో దారుణానికి ఒడిగట్టిందనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కొడుకును చూసే హక్కు అతడికి కోర్డు కల్పించడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. సో.. భర్త మీద కోపంతో తన కడుపున పుట్టిన అభం శుభం తెలియని చిన్నారిని చంపేసింది. ఇంతకి ఎలా చంపేసింది?… ఎక్కడ ప్లాన్ వేసింది..?.. పోలీసులకు ఎక్కడ పట్టుబడింది అనే వివరాలు చదవండి.