ఇకపై సిమ్ లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ పని చేయవు!
ఇకపై సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్‌లు పనిచేస్తాయి. మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్ చాట్, జియోచాట్, అరైట్టె, జోష్‌లకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.
- కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు.. 90 రోజుల్లో అమలులోకి
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఇకపై సిమ్ ఉంటేనే వాట్సాప్ (WhatsApp), టెలిగ్రామ్‌లు (Telegram) పనిచేస్తాయి. మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్ చాట్, జియోచాట్, అరైట్టె, జోష్‌లకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. సిమ్ యాక్టివేట్ అయి ఉన్న మొబైల్స్‌లో మాత్రమే ఈ యాప్‌లు పనిచేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన 90 రోజుల్లో అమల్లోకి వస్తుందని తెలిపింది. పనిచేయని నెంబర్లు, మోసాలు, స్పామ్‌లను తగ్గించడానికి, యూజర్ గుర్తింపు (కేవైసీ) పారదర్శకతను పెంచడానికి ఈ చర్యను తీసుకున్నట్టు ప్రకటించింది.
వినియోగదారుడి మొబైల్లోని రిజిస్టర్డ్ సిమ్ క్రియాశీలకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాప్‌లు పనిచేస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వెల్లడించింది. ఒక వేళ సిమ్‌ను తొలగించినా, పనిచేయకపోయినా యాప్‌లు కూడా ఆటోమెటిక్‌గా పనిచేయడం మానేస్తాయి. ఇక వెబ్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయితే ఆయా మెసేజింగ్ వేదికల నుంచి ప్రతి ఆరు గంటలకోసారి లాగౌట్ అవుతుంది. తర్వాత క్యూఆర్ కోడ్ ధ్రువీకరణ ద్వారా మొబైల్ సిమ్‌తో తిరిగి లాగిన్ అవ్వాలి. ప్రస్తుతం సిమ్ లేకపోయినా, అది పనిచేయకపోయినా ఈ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

