West Bengal | గవర్నర్ చేతిలోనే అంతా ఉండదు.. అసెంబ్లీ నిర్వహణపై బెంగాల్ స్పీకర్
శాసనసభ నిర్వహణ పూర్తిగా గవర్నర్‌పై ఆధారపడి ఉండదని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
- ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణంపై ప్రతిష్ఠంభన
- ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్పీకర్
West Bengal | కోల్‌కతా: శాసనసభ నిర్వహణ పూర్తిగా గవర్నర్‌పై ఆధారపడి ఉండదని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటిస్తూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ నిస్సహాయంగా ఉండదు. ప్రతీది గవర్నర్ చేతుల్లో ఉండదు. రాజ్యాంగ నిబంధనలు ఉంటాయి. వాటిని అందరూ పాటించాల్సిందే’ అని ఆయన గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలోనే ప్రమాణస్వీకారం చేస్తాం: ఎమ్మెల్యేలు
ఇటీవలి ఉప ఎన్నికల్లో సయంతిక బంద్యోపాధ్యాయ్, రయత్ హుస్సేన్ సర్కార్ విజయం సాధించారు. ఫలితాలు వచ్చి నెల రోజులు అవుతున్నా వీరి ప్రమాణస్వీకారం మాత్రం జరగలేదు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా గత వారం వీరిద్దరిని గవర్నర్ అనందబోస్ ఆహ్వానించారు. అయితే తాము అసెంబ్లీలోనే ప్రమాణం చేస్తామని వారు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆరు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ నిర్వహణ పూర్తిగా గవర్నర్‌పై ఆధారపడి ఉండదని స్పష్టం చేశారు. తనకు సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

