Amit Shah | అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం, ఘర్షణ.. నలుగురు పోలీసాఫీసర్లను సస్పెండ్ చేసిన ఈసీ
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 2న మంత్రి అమిత్ షా బెంగాల్‌లోని భవానిపూర్‌లో పర్యటించారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు.
అయితే, ఈ రోడ్ షోలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. బీజేపీ శ్రేణులు పాల్గొన్న ఈ రోడ్ షోలో టీఎంసీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య దాడి జరిగింది. సాధారణంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనే కార్యక్రమాలకు కఠిన భద్రత ఉంటుంది. ఇలాంటి దాడులకు అవకాశం ఉండదు. కానీ, భవానిపూర్‌లో మాత్రం హింసాత్మక వాతావరణం ఏర్పడింది. దీంతో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఈసీ కోరింది. ఈ నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. అమిత్ షా పర్యటనలో అనేక భద్రతా వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. దీనికి బాధ్యుల్ని చేస్తూ సిద్ధార్థ్ దత్తా అనే డీసీపీ సహా మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల్ని కాపాడటంలో వీరు విఫలమయ్యారని ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భవానిపూర్ నియోజకవర్గం చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచినా సీఎం కావడం ఖాయం. అయితే, మమతను ఓడించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఈ నియోజకవర్గంలో ఎన్నికల తతంగా ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- Bhabanipur
- BJP
- EC
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

