Watch: అంబులెన్స్ లేకపోవడంతో.. సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
Sister's Dead Body On Bike | అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. (Sister's Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. (Sister’s Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆరయాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం బిధునా ప్రాంతానికి చెందిన ఒక యువతి వాటర్ హీటర్ రాడ్ వల్ల విద్యుతాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే పరిశీలించిన డాక్టర్లు ఆ యువతి చనిపోయిందని చెప్పారు.
కాగా, ఆశ వీడని సోదరుడు తన సోదరిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన బైక్‌పై తీసుకెళ్లాడు. ఆ యువకుడు ఏడుస్తూ చనిపోయిన సోదరిని తన బైక్‌పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల కొరతపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి.
वीडियो औरैया के बिधूना CHC के सामने का है। एक बिलखता भाई अपनी बहन के शव को बाइक पर रखने का असफल प्रयास कर रहा है। दो लोग उसकी मदद भी कर रहे हैं।
जानते हैं, यह क्यों हुआ? क्योंकि इसे मदद के लिए एम्बुलेंस नहीं मिली।
एम्बुलेंस न मिलने से समय पर अस्पताल न आने के कारण या किसी न… pic.twitter.com/e0BX5sPnaF
— UP Congress (@INCUttarPradesh) November 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

