ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదాన్ని నియంత్రించాలి.. షాంఘై దేశాలను కోరిన మోదీ

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నారు. ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గ్రూపులోని సభ్యులంతా కనెక్టివిటీ, నమ్మకం లాంటి అంశాలపై పరస్పరం పనిచేయాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని, అక్కడ రాడికలైజేషన్, తీవ్రవాదం పెరగకుండా చూడాల్సిన బాధ్యతను ఎస్సీవో సభ్యులు నిర్వర్తించాలన్నారు.
సెంట్రల్ ఏషియా చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ప్రగతిశీల సంస్కృతులు, విలువలు సమ్మిళితం అయ్యాయన్నారు. కొన్ని శతాబ్ధాల పాటు సూఫిజం ఇక్కడ వర్ధిల్లిందన్నారు. ఆసియా ప్రాంతమంతా అది వ్యాపించిందని, ఇక్కడ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ పద్ధతులను చూడవచ్చు అని ప్రధాని మోదీ తెలిపారు. సెంట్రల్ ఏషియాలో ఉన్న చారిత్రక వారసత్వాన్ని పరిశీలిస్తే, ఎస్సీవో సభ్యదేశాలు తీవ్రవాదంపై కలిసి పోరోడాల్సి వస్తోందన్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో సభ్యదేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం కలిగి ఉన్న ఎన్నో ఇన్స్టిట్యూషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటైంది. కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్థాన్, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

