Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
Water Crisis : మహారాష్ట్రలోని పెద్ద పట్టణాలైన నాగ్‌పూర్, పూనేలను తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. అందుకే, ఉన్న నీటి వనరుల్ని సక్రమంగా వాడుకునేలా, నీరు వృథా, దుర్వినియోగం కాకుండా చూసేలా కఠిన చర్యలకు అక్కడి పాలకవర్గం సిద్ధమైంది.
Water Crisis : దేశంలో అత్యంత కరువు ఎదుర్కొనే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. అక్కడ అనేక ప్రాంతాల్లో నీటి వనరులు చాలా తక్కువ. అందులోనూ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడి, నీటి వనరులు తగ్గిపోయాయి. ఇదే సమయంలో పెద్ద పట్టణాలైన నాగ్‌పూర్, పూనేలను తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. అందుకే, ఉన్న నీటి వనరుల్ని సక్రమంగా వాడుకునేలా, నీరు వృథా, దుర్వినియోగం కాకుండా చూసేలా కఠిన చర్యలకు అక్కడి పాలకవర్గం సిద్ధమైంది.
దీనిలో భాగంగా నీటిని వృథా చేసేవారికి రూ.5,000 జరిమానా విధించాలని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. అంటే, ప్రతి ఒక్క నీటి వృథాకి రూ.5,000 చొప్పున ఫైన్ విధిస్తారు. అలాగే, మరో పెద్ద పట్టణమైన పూనేలో కూడా పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్టోబర్ 15 నుంచి వారానికోసారి నీటికి వీక్లీ కట్ ఇవ్వనుంది. అంటే, ప్రతి గురువారం నీటి సరఫరా ఉండదు. నాగ్‌పూర్‌కు సంబంధించి నీటి రేషనింగ్‌ను ఎన్ఎంసీ పరిశీలిస్తోంది. నగరంలో నీటి కొరతపై మేయర్ నీతా తకారే అధికారులతో సమీక్ష జరిపారు.
నీటి లభ్యత, సరఫరా వంటి వివరాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిని సద్వినియోగం చేసుకునే చర్యలపై దృష్టిపెట్టారు. దీని ప్రకారం తాగునీటిని వాహనాలు శుభ్రం చేయడానికి వాడకూడదు. రోడ్లను కడగడం, అరుగుల మీద నీళ్లు చల్లడం వంటివి చేయకూడదు. గార్డెన్లలో నీటి వినియోగం, నిర్మాణం రంగంలో నీటి వినియోగంపైనా పరిమితులు విధించనున్నారు. నాగ్‌పూర్‌కు నీళ్లు అందించే రిజర్వాయర్‌లో ప్రస్తుతం 746 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్లున్నాయి. ఇది పూర్తి సామర్ధ్యంలో 58 శాతం మాత్రమే. ఇటీవల వర్షాలు పడకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
అందువల్ల ఉన్న తక్కువ నీటిని సరిగ్గా వాడుకోవాలని ఎన్ఎంసీ భావిస్తోంది. పూనే నగరం కూడా ఈ అంశంపై దృష్టిపెట్టి, నీటి కోతలకు సిద్ధమైంది. ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. వారంలో గురువారం రోజు నీటి సరఫరా ఆపివేయనుంది. అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిపై కొరడా ఝుళిపించనుంది. అయితే, వేసవి కూడా రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చే వేసవిలో ఇంకెలాంటి కఠిన పరిస్థితులు చూడాల్సి వస్తుందో అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Nagpur
- Pune
- wastage
- water crisis
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

