Fire accident | కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.. Video
Fire accident | హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. షోరూమ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
రెవారీ: హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. షోరూమ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హర్యానా రాష్ట్రంలోని రెవారీ పట్టణంలో ఢిల్లీ రహదారిలోగల హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే, షోరూమ్‌లోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. ప్రమాదానికిగల కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
#WATCH | Rewari, Haryana: Fire breaks out at a car showroom located on Delhi Road. Four fire tenders and police are on the spot. Several cars burnt due to the fire. The cause of the fire remains unknown. Further details awaited pic.twitter.com/sWoFXvCDtp
— ANI (@ANI) September 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

