వృథా ఆక్సిజన్ పునర్వినియోగం

- ఐఐటీ-బాంబే ఆవిష్కరణ
ముంబై, మే 20: దవాఖానల్లో మెడికల్ ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఐఐటీ-బాంబే విద్యార్థులు, ప్రొఫెసర్లు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స తీసుకునే రోగులు బయటకు వదిలే (నిచ్ఛ్వాస) ఆక్సిజన్‌ను తిరిగి ఉపయోగించేవిధంగా మలిచే ‘బ్రీతింగ్ డివైజ్ ప్రోటోటైప్’ను అభివృద్ధి చేశారు. ‘రీబ్రీతర్’గా దీనికి పేరుపెట్టారు. ‘ఐసీయూలో చికిత్స తీసుకునే కరోనా రోగులకు నిమిషానికి 50 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తారు. ఇందులో వాళ్లు 1-1.5 లీటర్ల ఆక్సిజన్‌నే వినియోగిస్తారు. మిగతా 90 శాతానికి పైగా ఆక్సిజన్ వాతావరణంలో కలిసిపోతుంది. ‘రీబ్రీతర్’ పరికరంలోని క్లోజ్డ్ లూప్ సిస్టమ్ (లేదా సెమీ క్లోజ్డ్) సాయంతో వృథా అవుతున్న ఆక్సిజన్‌ను పునర్వినియోగిస్తాం’ అని ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ సంతోశ్ నోరోన్హా తెలిపారు. ఐసీయూల్లోని రోగుల నుంచి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ విడుదల అవుతుండటమే దవాఖానల్లో అగ్ని ప్రమాదాలకు కారణమని, ఈ పరికరం వాటిని తగ్గించవచ్చన్నారు. దీని తయారీకి రూ.10 వేలు ఖర్చు అయినట్టు, త్వరలో దీనిపై ట్రయల్స్ జరుపనున్నట్టు వివరించారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

