హిమాచల్‌ప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్.. ఎంత శాతం ఓటింగ్ నమోదైందంటే..!
Assemblypolls2022 | హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లను సీల్ చేశారు. అనంతరం
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లను సీల్ చేశారు. అనంతరం అన్ని పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలు, వీవీప్యాట్లను ధర్మశాల, షిమ్లా పోలింగ్ స్టేషన్లకు తరలించి భద్రపర్చారు. వాటిని భద్రపర్చిన పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు పోటీపడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువతతోపాటు వృద్ధులు కూడా పోటీపడి ఓట్లు వేశారు. దాంతో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 65.92 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆ తర్వాత కూడా క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. అన్ని స్థానాల్లో కలిపి 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 94 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నదని అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. కాగా, ఇవాళ పోలైన ఓట్లను వచ్చే నెల 8న ఈ లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

