ముంబై, మే 9: డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్ (ప్రముఖ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు)ను అరెస్టు చేసిన నార్కోటిక్ అధికారుల్లో ఒకరైన విశ్వ విజయ్ సింగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిస్మిస్ చేసింది. ‘ఒక కేసులో విశ్వవిజయ్ సింగ్‌ను గత ఏడాది సస్పెండ్ చేశాం.
ఆ కేసులో విచారణ పూర్తవటంతో ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తున్నా’మని మంగళవారం ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి తుది ఉత్తర్వులు గత నెలలోనే వెలువడ్డాయని తెలిపింది. 2021లో ఒక నౌకలో జరిగిన వేడుకపై ఎన్సీబీ దాడులు చేపట్టి, ఆర్యన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.