Viral News | అరుదైన మంచినీటి చేప.. 40 ఏళ్ల క్రితం అదృశ్యం.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షం..!
Viral News | ఇది అత్యంత అరుదైన చేప (Rare Fish). చూడటానికి అందంగా, వింతగా ఉంటుంది. దీన్ని స్పినాక్ పైప్ ఫిష్ (Spinak Pipe Fish) అంటారు. ఈ అరుదైన మంచినీటి చేప నాలుగు దశాబ్ధాలుగా కనిపించకుండా పోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమైంది. శాస్త్రవేత్తలు చివరిసారిగా 1985లో ఈ చేప ఉనికిని చూశారు.
Viral News : ఇది అత్యంత అరుదైన చేప (Rare Fish). చూడటానికి అందంగా, వింతగా ఉంటుంది. దీన్ని స్పినాక్ పైప్ ఫిష్ (Spinak Pipe Fish) అంటారు. ఈ అరుదైన మంచినీటి చేప నాలుగు దశాబ్ధాలుగా కనిపించకుండా పోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమైంది. శాస్త్రవేత్తలు చివరిసారిగా 1985లో ఈ చేప ఉనికిని చూశారు. ఆ తర్వాత నుంచి ఎక్కడా కనిపించలేదు. తాజాగా పపువా న్యూగినియా (Papua New Guinea) లోని సెపిక్ నది (Sepic River) లో ఈ చేపను కనుగొన్నారు. స్థానిక ప్రజల సహకారం వల్లే ఈ అరుదైన చేప ఉనికి బయటపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా ఈ ఏడాది జూన్ నెలలో ఈ చేప కోసం గాలిస్తున్న పరిశోధకుల బృందం చూసిచూసి ఆశలు వదులుకుంది. ఫలితం లేక నిరాశతో వెనుదిరగడానికి సిద్ధమైంది. కానీ ఆఖరి రోజున ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇంబండో గ్రామానికి చెందిన హెలెన్ అసు అనే స్థానిక మహిళ రొయ్యల కోసం తన సంప్రదాయ చేతి వల ‘ఉంబెన్’ తో వేటాడుతుండగా రెండు పైప్ఫిష్లు చిక్కాయి. పరిశోధకురాలు జెర్రికా ఏజ్బిగో వాటిని ఫోటోలు తీసి నిపుణులకు పంపగా వారు అది స్పినాక్ పైప్ఫిష్ అని ధ్రువీకరించారు.
సముద్ర గుర్రాల జాతికి చెందిన ఈ చేప సన్నని శరీరం, పొడవాటి ముట్టెతో విభిన్నంగా ఉంటుంది. ఆకుపచ్చ-గోధుమ రంగులో ఉండటంవల్ల నది ఒడ్డున ఉండే జలచర మొక్కలలో ఇది సులభంగా కలిసిపోతుంది. సముద్ర గుర్రాల మాదిరిగానే మగ చేపలు తమ కడుపులోని సంచిలో పిల్లలను మోయడం వీటి ప్రత్యేక లక్షణం. శాస్త్రవేత్తలు దీనిని ‘అంతరించిపోయిన చేపల’ జాబితాలో చేర్చినప్పటికీ స్థానిక ప్రజలకు దీని ఉనికి గురించి ఎప్పటి నుంచో తెలుసు. వారు దీనిని ‘కరువెంగ్’, ‘ఇనాప్’ వంటి స్థానిక పేర్లతో పిలుచుకుంటారు.
దీన్నిబట్టి శాస్త్రీయ రికార్డులలో లేనప్పటికీ ఈ జాతి ఆ ప్రాంతంలో మనుగడ సాగిస్తోందని అర్థమవుతోంది. ప్రస్తుతం పరిశోధకులు ఈ చేపల జీవనశైలి, ఇతర అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేసేందుకు సిద్దమవుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

