కదులుతున్న కారు టాప్‌పై యువకుల డ్యాన్స్.. రూ.20 వేలు ఫైన్ వేసిన పోలీసులు
Ghaziabad | అసలే అది రద్దీగా ఉండే రోడ్డు. కారులో వెళ్తున్న యువకులు ఫీట్లు చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కారు టాప్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేశారు. అటుగా కారులో వెళ్తున్న మరో కారులోని వ్యక్తులు వారి ఫీట్‌ను వీడియో తీశారు.
న్యూఢిల్లీ: అసలే అది రద్దీగా ఉండే రోడ్డు. కారులో వెళ్తున్న యువకులు ఫీట్లు చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కారు టాప్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేశారు. అటుగా కారులో వెళ్తున్న మరో కారులోని వ్యక్తులు వారి ఫీట్‌ను వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారడంతో.. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కారు యజమానికి రూ.20 వేలు జరిమానా వేశారు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ ఎర్టిగా కారు వెళ్తున్నది. ఘజియాబాద్‌లోని బులంద్‌షహర్ రోడ్డులో ఇద్దరు యువకులు కారు టాప్‌పైకి ఎక్కారు. మద్యం మత్తులో ఉన్నవారు కారు నెమ్మదిగా కదులుతుండగా స్టెప్పులు వేశారు. వేరే కారులో వెళ్తున్నవారు ఆ యువకుల ఫీట్‌ను తమ ఫోన్లలో బంధించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కారుపై డ్యాన్స్ చేస్తున్న ఈ యువకులకు పోలీసులు త్వరలోనే తమ స్టైల్లో లాకప్‌లో స్టెప్పులేయిస్తారని పేర్కొంటూ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశాడు. అది కాస్తా వేరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కారు యజమానికి రూ.20 వేలు జరిమానా విధించారు.
https://twitter.com/scribe_prashant/status/1510073869977395204?s=20&t=0ebGadiG-P6igIr1lqxogg
కారు యజమానికి ఫైన్ విధించామని పేర్కొంటూ ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. కారు నంబర్ స్పష్టంగా కనిపించేలా అందులో పేర్కొన్నారు.
— Ghaziabad Traffic Police (@Gzbtrafficpol) April 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

