వెంకయ్యకు కొనసాగింపూ లేనట్టే
రాష్ట్రపతి పదవికి తన పేరు నలిగినప్పటికీ చివరికి పక్కన పెట్టడంపై వెంకయ్యనాయుడు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. మరో 45 రోజుల్లో రాజ్యసభ చైర్మన్ పదవి ముగిసిపోతే ఆయన ఖాళీ అయిపోతారు. ఉపరాష్ట్రపతి పదవి రెండో విడత ఇస్తారనే సూచనలూ లేవు. విశ్రాంత జీవితానికి ఏదైనా బంగళాను ఎంచుకోమని ఓ మంత్రి వెళ్లి అడిగిన ఒక అధికారిపై
అద్వానీ పట్ల విధేయతే సమస్య?
పదవి చేజారడంపై ఊహాగానాలు
(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రపతి పదవికి తన పేరు నలిగినప్పటికీ చివరికి పక్కన పెట్టడంపై వెంకయ్యనాయుడు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. మరో 45 రోజుల్లో రాజ్యసభ చైర్మన్ పదవి ముగిసిపోతే ఆయన ఖాళీ అయిపోతారు. ఉపరాష్ట్రపతి పదవి రెండో విడత ఇస్తారనే సూచనలూ లేవు. విశ్రాంత జీవితానికి ఏదైనా బంగళాను ఎంచుకోమని ఓ మంత్రి వెళ్లి అడిగిన ఒక అధికారిపై ఆయన కోపంగా మాట్లాడారని చెప్పుకొంటున్నారు. ఆయన ఢిల్లీలోనే ఉండిపోతారా? లేక హైదరాబాద్‌కు మారిపోతారా? అనే విషయమై ఊహాగానాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆయనతో మంతనాలు జరిపారు. ప్రధాని మోదీ ఆయన వద్దకు ఏం రాయబారం పంపారనేది కూడా చర్చాంశమైంది. ‘క్షమించాలి.. అత్యున్నత పదవిని మీకు ఇవ్వలేకపోతున్నాం’ అని తెలియజెప్పడమే ఈ మంతనాల ఉద్దేశమని తెలుస్తున్నది.
‘క్షమించాలి రెండవ విడత ఇవ్వలేం’ అని ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలియజేసేందుకు కూడా మోదీ ఈ తరహా రాయబారమే నడిపారు. ఆ సంగతి అలా ఉంచితే 2014లో ప్రధాని మోదీ హోం తదితర కీలక శాఖలకు వెంకయ్యను దూరంగా పెట్టారు. అప్పుటి నుంచీ వెంకయ్యకు అన్నీ ఎదురుదెబ్బలే. ఇంతకూ రాష్ట్రపతి పదవిని వెంకయ్య ఆశించారా? దాని కోసం లాబీయింగ్ జరిపారా? 2017లో హామీ ఇచ్చి ఇప్పుడు తప్పారా? ఇవన్నీ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు. బీజేపీ నేతల్లో కెల్లా ఎక్కువ ఎదురుదెబ్బలు తిన్నది వెంకయ్యే అంటున్నారు. గతంలో కీలక బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో బీజేపీ నేతలు తనతో వాగ్వాదాలకు దిగడం ఆయనను చాలా బాధించిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పట్ల విధేయతే ఆయనకు నష్టం చేసిందన్న వాదనలు కూడా ఉన్నాయి. నూపుర్ శర్మ వివాదం కారణంగా యూఏఈ పర్యటనలో షేక్‌తో అధికారిక విందు రద్దు కావడం వెంకయ్య ఎదుర్కొన్న అత్యంత దుర్భరమైన అనుభవం. డీఎంకే అధికార పత్రిక మురసోలిలో వెంకయ్యను రాష్ట్రపతిని చేయాలని వ్యాసం రావడం వల్ల ఆయనకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. రాష్ట్రపతి పదవి అందని ద్రాక్ష అయ్యింది. ఉపరాష్ట్రపతి పదవిని రెండో విడత చేపట్టే అవకాశాలు దాదాపు లేనట్టే. ఇక క్రియాశీల పార్టీ రాజకీయాలకు దూరంగా మార్గదర్శక్ మండల్ అనే రిటైర్డు నేతల ఆశ్రమంలో తన గురువైన అద్వానీ, మురళీమనోహర్ జోషీలతో కలిసి వెంకయ్య చేరక తప్పదు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మరో బీజేపీ నేత భైరాన్‌సింగ్ షెకావత్ చేసింది అదే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

