డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ చెల్లుబాటు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) చెల్లుబాటు గడువును పెంచింది. ఈ నెల 30 వరకూ ఇవి చెల్లుబాటు అవుతాయని గతంలో చెప్పినా.. తాజాగా దీనికి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్న ఈ పరిస్థితుల్లో ఫిట్నెస్, పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలకు సెప్టెంబర్ 30 వరకూ చెల్లుబాటు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రోడ్డు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్లో తెలిపింది.
మరోవైపు డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు, లైసెన్సుల జారీకి సంబంధించి కూడా పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. గతంలో లైసెన్స్ జారీకి ముందు కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేవారు. అయితే ఈ సెంటర్లలో డ్రైవింగ్ టెస్ట్ పాసైన వాళ్లకు తిరిగి టెస్ట్ అవసరం లేదని ఈ మధ్య జారీ చేసిన ఆదేశాల్లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Taking into consideration the need to prevent the spread of COVID-19, MoRT&H has advised the Enforcement Authorities that the validity of Fitness, Permit (all types), License, Registration or any other concerned document(s) may be treated to be valid till 30th Sept, 2021. pic.twitter.com/xe6QIvks5T
— MORTHINDIA (@MORTHIndia) June 17, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

