Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Pushkar Singh Dhami : మద్రాసాల నిర్వహణకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న శుక్రవారం సెలవును రద్దు చేసింది.
Pushkar Singh Dhami : మద్రాసాల నిర్వహణకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న శుక్రవారం సెలవును రద్దు చేసింది. ఇకపై అన్ని విద్యా సంస్థలలాగే మద్రాసాలకు కూడా ఆదివారమే సెలవు దినంగా పాటించేలా సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డెహ్రడూన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం ధామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఆదివారమే సెలవు దినంగా అమలవుతుందన్నారు. ఇప్పటికే అక్కడి బీజేపీ ప్రభుత్వం మద్రాసా విద్యా విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్రాసా విద్యా విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గత జూలై 1న ఆదేశాలు జారీ చేసింది. అంటే, ఇకపై మద్రాసాలలో కూడా ప్రభుత్వం ఆమోదించిన విద్యా విధానమే అమలవుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏం బోధిస్తారో.. మద్రాసాలలో కూడా అదే బోధించాలి. ఇతర మతపరమైన బోధనలు చేయడానికి వీల్లేదు.
ఈ ఏడాది నుంచి మద్రాసాలలో సాధారణ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, గత ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్)ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే యూసీసీ ఉత్తరాఖండ్‌లో అమలవుతోందని, అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం వర్తిస్తుందన్నారు. విద్యావ్యవస్థకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. దీనిలో భాగంగా మద్రాసాలలో ప్రత్యేక విధానాన్ని రద్దు చేశామని, ఇప్పుడు శుక్రవారం బదులు.. ఆదివారం సెలవు అమలు చేస్తున్నామన్నారు.
విద్యార్థులతోపాటు టీచర్లు, సిబ్బందికి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. అయితే, ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

