లక్నో: మరో బీజేపీ నేత మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. పై అంతస్తులోని గదిలోకి వెళ్లే ముందు ఆ మహిళను కౌగిలించుకున్నాడు. (BJP’s Gonda District President With Woman) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్కిషోర్ బామ్ బామ్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు.
కాగా, బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్కిషోర్ బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత బామ్ బామ్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. ఇది ఏప్రిల్ 12 నాటిదని తెలిపారు. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైందని చెప్పారు. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని చెప్పానని అన్నారు.
కాగా, మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేసినట్లు బామ్ బామ్ తెలిపారు. అయితే తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని ఆయన అన్నారు.
रात के 9.39 बजे हैं। Video उत्तर प्रदेश में गोंडा जिले के BJP दफ्तर की है। जिलाध्यक्ष अमर किशोर एक महिला को लेकर आते हैं। आलिंगन जिलाध्यक्ष जी CPR देते भी दिखते हैं, फिर एक फ्लोर ऊपर चले जाते हैं। वहां की फुटेज अभी प्राप्त नहीं हुई है।
जिलाध्यक्ष का बयान– “महिला कार्यकर्ता की… pic.twitter.com/vqRMTV14v3
— Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2025
आलिंगन में फंसे गोंडा के BJP जिलाध्यक्ष अमर किशोर उर्फ बम बम ने कहा–
“सक्रिय महिला कार्यकर्ता का फोन आया कि तबियत खराब है। हम उसे गाड़ी से लेने पहुंच गए। वो 2–4 घंटे आराम करना चाहती थी तो हम उसको दफ्तर ले आए। चक्कर आने की वजह से हमने उसको सहारा दिया” https://t.co/Dw6Uw9Jmbc pic.twitter.com/smJrdZPJvU
— Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2025