శవాల కొవ్వుతో సౌందర్య పోషణ!
తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి అమెరికా మహిళలు ఇటీవల ఓ కొత్త ట్రెండ్‌ను విపరీతంగా అనుసరిస్తున్నారు. తమ రొమ్ములు, తుంటి, పిరుదులను మెరుగుపరుచుకోవడానికి మరణించిన వ్యక్తి దేహం నుంచి సేకరించిన కొవ్వును ఇంజెక్షన్ ఫిల్లర్‌గా ఉపయోగించే కొత్త ధోరణి అమెరికాలో పెరిగిపోతున్నది.
న్యూఢిల్లీ: తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి అమెరికా మహిళలు ఇటీవల ఓ కొత్త ట్రెండ్‌ను విపరీతంగా అనుసరిస్తున్నారు. తమ రొమ్ములు, తుంటి, పిరుదులను మెరుగుపరుచుకోవడానికి మరణించిన వ్యక్తి దేహం నుంచి సేకరించిన కొవ్వును ఇంజెక్షన్ ఫిల్లర్‌గా ఉపయోగించే కొత్త ధోరణి అమెరికాలో పెరిగిపోతున్నది. ఈ ప్రక్రియను ప్రధానంగా టైగర్ ఈస్తటిక్స్ కంపెనీ అల్లోక్లే బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నది. వైద్య శాస్త్రం కోసం అవయవ, కణజాలాన్ని దానం చేసిన వ్యక్తుల మృతదేహాల నుంచి కొవ్వును సేకరిస్తారు.
తర్వాత దీనిని స్టెరిలైజ్ చేసి, శుద్ధి చేసి అసెల్యులార్ ఫ్యాట్ మ్యాట్రిక్స్‌గా ప్రాసెస్ చేస్తారు. అంటే రోగనిరోధక ప్రతిస్పందనను తొలగించడానికి అన్ని డీఎన్ఏ, జీవకణాలను తొలగిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియను బక్కపలచగా ఉన్న వ్యక్తులు లేదా సంప్రదాయక బ్రెజీలియన్ బట్ లిఫ్ట్(బీఆర్ఎల్) కోసం తమ శరీరంలో కొవ్వు తక్కువగా ఉన్న లేదా ఇదివరకే లైపోసెక్షన్ చేసుకున్న వ్యక్తులకు చేస్తారు. ఒజెంపిక్, మౌంజారో వంటి వెయిట్ లాస్ మందులు వాడి గణనీయంగా బరువు తగ్గిన వ్యక్తులు ఈ ప్రొసీజర్ చేయించుకుంటున్నట్లు ప్లాస్టిక్ సర్జన్ డారెన్ స్మిత్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

