engagement day murder | నిశ్చితార్థం రోజున యువతిని కాల్చి చంపిన వ్యక్తి.. ఆపై ఆత్మహత్య
engagement day murder | తుపాకీ కాల్పుల శబ్ధం విన్న నీతూ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న సోనూను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతడు తప్పించుకునేందుకు పొరుగున ఉన్న బిల్డింగ్‌లోకి జంప్ చేశాడు. ఒక గదిలోకి వెళ్లి లోపలి నుంచి లాక్ చేసుకున్నాడు.
లక్నో: నిశ్చితార్థం రోజున యువతిని ఒక వ్యక్తి గన్‌తో కాల్చి చంపాడు (engagement day murder). ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దాసోతి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోనూ ప్రజాపతి డైరీ షాపులో పని చేస్తున్నాడు. మరో ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల నీతూను ప్రేమించాడు. అయితే అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై సోనూ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల నీతూకు ఒక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో మంగళవారం నిశ్చితార్థం జరుగనుండగా, ఆమె కుటుంబ సభ్యులు ఆ హడావుడిలో ఉన్నారు. ఈ సందర్భంగా నీతూ ఇంట్లోకి సోనూ చొరబడ్డాడు. వెంట తెచ్చిన గన్‌తో ఆమె తలపై కాల్పులు జరిపి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
కాగా, తుపాకీ కాల్పుల శబ్ధం విన్న నీతూ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న సోనూను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతడు తప్పించుకునేందుకు పొరుగున ఉన్న బిల్డింగ్‌లోకి జంప్ చేశాడు. ఒక గదిలోకి వెళ్లి లోపలి నుంచి గడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత గదిలోని సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరోవైపు నీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒన్‌సైడ్ లవ్ వ్యవహరం వల్ల ఆ యువతిని అతడు హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

