Gitanjali Aiyar | తొలితరం ఇంగ్లిష్ న్యూస్ యాంకర్ గీతాంజలి అయ్యర్ మృతి
దేశంలో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్ యాంకర్లలో (News anchor) ఒకరైన గీతాంజలి అయ్యర్ (Gitanjali Aiyar) కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: దేశంలో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్ యాంకర్లలో (News anchor) ఒకరైన గీతాంజలి అయ్యర్ (Gitanjali Aiyar) కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) సంతాపం తెలిపారు. దూరదర్శన్ (Doordarshan), ఆల్ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లిష్ న్యూస్ యాంకర్లలో (English news presenter) ఆమె ఒకరని చెప్పారు. దూరదర్శన్‌కు ఆమె చేసిన సేవలను కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోల్‌కతాలోని లొరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన గీతాంజలి.. 1971లో దూరదర్శన్‌లో చేరారు. 30 ఏండ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు. దూరదర్శన్‌లో కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ (Khandaan) అనే సీరియల్లోనూనటించారు. నాలుగుసార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగానికి చేసిన సేవలకుగాను 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ ఉమెన్ పురస్కారాన్ని దక్కించుకున్నారు.https://twitter.com/ianuragthakur/status/1666502985944547329?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

