Balaghat Encounter | మధ్యప్రదేశ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) బాలాఘాట్ (Balaghat) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్(Encounter) ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) మరణించారు.
బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) బాలాఘాట్ (Balaghat) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్(Encounter) ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) మరణించారు. శనివారం తెల్లవారుజామున బాలాఘాట్లోని కాడ్లా అటవీ (Kadla forest) ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మరణించిన మావోయిస్టులను ఏరియా కమిటీ మెంబర్ (AMC), భోరందేవ్ కమిటీ కమాండర్ అయిన సునీత, ఏరియా కమిటీ మెంబర్ సరితా ఖాటియా మోచాగా గుర్తించారు. ఇద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉన్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో తుపాకులు, కాట్రిజ్‌లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.
కాగా, బాలాఘాట్‌లో గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులు క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ పోలీసుకు శాంతి భద్రతలను కాపాడటం సమస్యగా మారింది. దీంతో నక్సలైట్ల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో గతేడాది ఆరును మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

