ఒకేసారి రన్‌వేపై రెండు విమానాలు
ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్‌వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణ చేప్టటింది.
- ముంబైలో తప్పిన పెనుప్రమాదం
ముంబై, జూన్ 9: ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్‌వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణ చేప్టటింది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ)గా ఉన్న వ్యక్తిని విధుల నుంచి తొలగించింది.
ఘటనపై ఇండిగో కూడా విచారణ చేపట్టింది. ఏటీసీ ఆదేశాల మేరకు తాము విమానాన్ని ల్యాండింగ్ చేశామని ఇండిగో తెలిపింది. నిబంధనల ప్రకారం దిగబోతున్న విమానానికి ఏటీసీ ల్యాండింగ్ అనుమతి ఇచ్చిన తర్వాతే బయల్దేరే విమానం రన్ వే చివరను క్రాస్ చేయాలి లేదా మలుపు తీసుకోవాలి. అయితే తాజా ఘటనలో ఈ నిబంధనను పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ముంబై ఎయిర్పోర్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉన్నప్పుడు ఏటీసీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

