Manipur | మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. జవాన్ సహా ఇద్దరు మృతి
మణిపూర్‌లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కాంగ్పోక్పీ (Kongpokpi) జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్బీ జవాన్ (IRB Jawan) సహా మరో పౌరుడు మృతిచెందారు.
ఇంఫాల్: మణిపూర్‌లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కాంగ్పోక్పీ (Kongpokpi) జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్బీ జవాన్ (IRB Jawan) సహా మరో పౌరుడు మృతిచెందారు. సోమవారం రాత్రి హరోథెలా, కోబ్షా గ్రామాల మధ్య ఘర్షణ చెలరేగడంతో (Ambush) ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB) బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో (Gunfire) ఐఆర్బీ జవాన్, వారి వ్యాన్ నడుపుతున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వారిని హుటాహుటిన దవాఖానకు తరలించినప్పటికీ లాభం లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. మృతులను హెన్మిన్లెన్ వైఫే, తంగ్మిన్లున్ హాంగ్సింగ్‌గా గుర్తించామన్నారు.
కాల్పులకు సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. దాడి ఘటనతో సంబంధమున్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా, కుకీ-జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని ఓ గిరిజన సంస్థ ప్రకటించింది. దీంతో జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో మెయిటీ, కుకీ కమ్మూనిటీల మధ్య రిజర్వేన్ల వివాదం ఈ ఏడాది మే 3న ప్రారంభమైంది. రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికవరకు సుమారు 200 మంది చనిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

