రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. కాల్పుల్లో పలువురికి గాయాలు
పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు. పలు ఇండ్లు, వాహనాలను ధ్వంసం చేశారు.
కోల్కతా: రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రతువాలోని మదర్సా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు మాత్రమే ఈ ఎన్నికలో పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు. పలు ఇండ్లు, వాహనాలను ధ్వంసం చేశారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టీఎంసీకి చెందిన ఇరు వర్గాల వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఒకరికి బుల్లెట్ గాయమైనట్లు చెప్పారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- clash
- Firing
- TMC workers
- Two groups
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

