HIV Vaccine | హెచ్ఐవీకి టీకా వచ్చేసింది.. వారం వ్యవధిలో రెండు డోసులు
ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది హెచ్ఐవీ మహమ్మారి బారినపడుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు.
HIV Vaccine | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది హెచ్ఐవీ మహమ్మారి బారినపడుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. రోగ నిరోధక శక్తికి దొరకకుండా హెచ్ఐవీ వైరస్ తరచూ మ్యుటేషన్కు లోనవుతుండటంతో ఈ వ్యాధిని నయం చేయడం కుదరట్లేదు. శక్తిమంతమైన ఔషధాలు, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఏడు వ్యాక్సిన్ డోసులతో ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు హెచ్ఐవీ నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
వారం వ్యవధిలో రెండు డోసులు
హెచ్ఐవీ నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు మోతాదులుగా ఇస్తారు. తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి వేస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. ‘ఇంట్రెస్టింగ్ ఇంజినీరింగ్’ ఈ వివరాలను వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

