TTD | తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. రేపు శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాలను (Break Darshan) టీటీడీ (TTD) రద్దు చేసింది.
తిరుమల: భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాలను (Break Darshan) టీటీడీ (TTD) రద్దు చేసింది. నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. ఇక జూలై 17వ తేదీన శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, వస్తువులు, పూజా సామాగ్రి, గోడలు, పూజా సామాగ్రి సహా శ్రీవారి ఆలయాలలోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా శాస్త్రోక్తంగా శుద్ధి చేయడాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు.
కాగా, శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతున్నది. దీంతో ఆలయంలోని 24 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం స్వామివారిని 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,231 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న భక్తులు మొక్కుల ద్వారా రూ.4.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

