Family Strips In Protest | పెళ్లి రోజున అరెస్టైన గిరిజనుడు కస్టడీలో మృతి.. దుస్తులు విప్పి నిరసన తెలిపిన మహిళలు
Family Strips In Protest | పెళ్లి రోజున అరెస్టైన గిరిజన వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. కలెక్టరేట్ వద్ద మహిళలు దుస్తులు విప్పి నిరసన తెలిపారు.
భోపాల్: పెళ్లి రోజున అరెస్టైన గిరిజన వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. కలెక్టరేట్ వద్ద మహిళలు దుస్తులు విప్పి నిరసన తెలిపారు. (Family Strips In Protest) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. గుణా జిల్లాలోని పార్ధి గిరిజన వర్గానికి చెందిన 25 ఏళ్ల దేవ పార్ధి పెళ్లి ఆదివారం జరుగాల్సి ఉంది. అయితే ఆ సాయంత్రం పెళ్లి ఊరేగింపునకు సిద్ధమవుతున్న వరుడు దేవ, అతడి బంధువు గంగారామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో జరిగిన ఒక దొంగతనం కేసులో వారిని ప్రశ్నించారు.
కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న దేవ గుండెపోటుతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి చెప్పారు. ఈ నేపథ్యంలో గిరిజనులైన దేవ పార్ధి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కస్టడీలో ఉన్న దేవను పోలీసులు కొట్టి చంపారని ఆరోపించారు. గాయపడిన గంగారామ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళలు పై దుస్తులు విప్పి నిరసన చేశారు. పెద్ద పెట్టున రోధించారు.
మరోవైపు కలెక్టర్ కార్యాలయం నుంచి వారిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఒక మహిళ, పోలీస్‌కు గాయాలయ్యాయి. అయితే దేవ మృతదేహానికి భోపాల్‌లో పోస్ట్‌మార్టం చేయాలని బాధిత కుటుంబం తొలుత డిమాండ్ చేసింది. చివరకు అధికారుల హామీ తర్వాత మెజిస్టీరియల్ విచారణకు అంగీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

