Bihar | నృత్య ప్రదర్శనను తిలకిస్తుండగా కూలిన పైకప్పు.. వందలాది మందికి గాయాలు.. షాకింగ్ వీడియో
Bihar | బీహార్ (Bihar)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో రూఫ్ కూలి (Roof Collapses) పలువురు గాయపడ్డారు.
Bihar | బీహార్ (Bihar)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో రూఫ్ కూలి (Roof Collapses) పలువురు గాయపడ్డారు. ఛప్రా (Chhapra) నగరంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరన్ జిల్లాలో మంగళవారం రాత్రి ఇషావ్పూర్ బ్లాక్‌లో మహావీర్ అఖారా (Mahavir Akhara) ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. నృత్య ప్రదర్శనను తిలకించేందుకు చాలా మంది భవనాల పైకప్పులపైకి ఎక్కారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటిపైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన జనం గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూఫ్ కూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
आर्केस्ट्रा नाच देखने के दौरान बिहार के छपरा में हादसा
इशुआपुर में महावीर मेला के दौरान करकटनुमा छज्जे पर खड़े होकर आर्केस्ट्रा देख रहे लोग अचानक गिर पड़े#Bihar #accident pic.twitter.com/KSSDfBeCVQ
— Thakur Divya Prakash (@Divyaprakas8) September 4, 2024
Also Read..
Suresh Raina | రామ్‌చరణ్ నా ఫేవరెట్.. ఆయనో డిఫరెంట్ యాక్టర్ : సురేశ్ రైనా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

