Tiger Kill | పట్టుకునేందుకు వెళ్తే దాడి.. పులిని కాల్చిచంపిన అధికారులు
Tiger Kill | పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేసింది. దాంతో ఆత్మరక్షణ కోసం అధికారులు ఆ పులిని కాల్చి చంపారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్ గ్రామంలో చోటుచేసుకుంది.
Tiger Kill : పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేసింది. దాంతో ఆత్మరక్షణ కోసం అధికారులు ఆ పులిని కాల్చి చంపారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల అటవీ ప్రాంతం నుంచి సమీప జనావాసాల్లోకి వచ్చిన పులి.. అక్కడ కొన్ని పశువులను చంపింది.
ఈ నేపథ్యంలో దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది దానికి మత్తుమందు ఇవ్వడానికి ప్రయత్నించారు. 15 మీటర్ల దూరం నుంచి దానిపై తుపాకీతో ట్రాంక్విలైజర్ (మత్తు మందు) ను ప్రయోగించారు. దాంతో అది ఒక్క ఉదటున అధికారులపై దూకింది.
దాడి చేస్తుండగా ఆత్మరక్షణ కోసం అటవీ సిబ్బంది వెంటనే దానిపై కాల్పులు జరపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆ పులి మృతి చెందినట్లు అటవీశాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. మృతిచెందిన పులి వయసు పదేళ్లు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

