Fake Notes: సర్క్యులేషన్లో ఎక్కువగా రూ.500 నకిలీ నోట్లు : ఆర్బీఐ రిపోర్టు
Fake Notes: రూ.500 డినామినేషన్‌కు చెందిన ఫేక్ నోట్లు ఎక్కువగా సర్క్యులేషన్లో ఉన్నట్లు ఆర్బీఐ తన రిపోర్టులో తెలిపింది. రూ.2000 నోట్లతో పోలిస్తే .. రూ.500 ఎక్కువగా ఫేక్‌గా ఉన్నాయని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: రూ.2000 నోట్లతో పోలిస్తే.. రూ.500 డినామినేషన్‌కు చెందిన నకిలీ నోట్లే (Fake Notes)ఎక్కువగా సర్క్యులేషన్లో ఉన్నట్లు ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. 2022-23 సీజన్లో రూ.500 డినామినేషన్‌కు చెందిన 14.4 శాతం నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. గత ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్లను గుర్తించినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక అదే సంవత్సర కాలంలో రూ.2000 నోట్లలో కేవలం 9806 పీసులు మాత్రమే నకిలీవి వెళ్లినట్లు ఆర్బీఐ తన నివేదికలో చెప్పింది.
రూ.20కు చెందిన నోట్లల్లో కూడా 8.4 శాతం నోట్లు నకిలీవి దొరికినట్లు ఆర్బీఐ తన రిపోర్టులో తెలిపింది. ఇక రూ.10, రూ.100, రూ.2000 నోట్లల్లో నకిలీలు 11.6 శాతం పడిపోయినట్లు ఆర్బీఐ పేర్కొన్నది. ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్(ఎఫ్ఐసీఎన్) ప్రకారం 2022-23లో 2,25,769 ఫేక్ నోట్లు రాగా, అంతకుముందు ఏడాది 2,30,971 నకిలీ నోట్లు వచ్చినట్లు ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. ఫేక్ నోట్లలో 4.6 శాతం నోట్లను రిజర్వ్ బ్యాంక్ గుర్తించగా, ఇతర బ్యాంకులు 95.4 శాతం నోట్లను గుర్తించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

