Visa Fare | వీసా ఫీజు భారీగా పెంచిన బ్రిటన్ ప్రభుత్వం.. స్టూడెంట్ వీసా ఫీజు రూ.50 వేలు
Visa Fare | వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని అమెరికా ఎంబసీ అలర్ట్ జారీచేసింది. దరఖాస్తు రుసుం మొత్తం చెల్లించినప్పటికీ, నిర్ణీత సమయానికి వీసా ఇంటర్వ్యూకి హాజరుకాకపోతే గడువు ముగిసినట్టుగానే పరిగణిస్తామని యూఎస్ ఎంబసీ తాజాగా పేర్కొన్నది.
- లేకపోతే గడువు ముగిసినట్టే
- వీసా దరఖాస్తుదారులకు అమెరికా ఎంబసీ సందేశాలు
- వీసా ఫీజును భారీగా పెంచిన బ్రిటన్ ప్రభుత్వం
- వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ సమయాన్ని ఎంచుకోండి: అమెరికా ఎంబసీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని అమెరికా ఎంబసీ అలర్ట్ జారీచేసింది. దరఖాస్తు రుసుం మొత్తం చెల్లించినప్పటికీ, నిర్ణీత సమయానికి వీసా ఇంటర్వ్యూకి హాజరుకాకపోతే గడువు ముగిసినట్టుగానే పరిగణిస్తామని యూఎస్ ఎంబసీ తాజాగా పేర్కొన్నది. 2022, అక్టోబర్ 1 కంటే కంటే ముందు వీసా అప్లికేషన్ ఫీజు మొత్తం చెల్లించి, ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోని వారు.. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా వెంటనే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా ఎక్స్ పోస్టు అలర్ట్ సందేశం ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఇంటర్వ్యూకు హాజరయ్యే విధంగా బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే తర్వాతి నెలల్లో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు అనుగుణంగా సిస్టమ్‌లో ముందు అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ముగియనున్న మినహాయింపులు
సాధారణంగా వీసా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించిన తర్వాత ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేసుకొనేందుకు ఏడాది సమయం ఉంటుంది. ఫీజు చెల్లింపు తర్వాత 365 రోజుల్లోగా అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పేమెంట్ గడువు ముగిసిపోయినట్టుగా భావిస్తారు. అయితే ఈ విషయంలో కొవిడ్-19 సంక్షోభం సమయంలో కొన్ని మినహాయింపులు, పొడిగింపులు ఇచ్చారు. అయితే ఈ మినహాయింపులు సెప్టెంబర్ 30తో ముగిసిపోతున్నాయని ఎంబసీ తెలిపింది.
యూకే స్టూడెంట్ వీసా ఫీజు రూ.50 వేలు
మరోవైపు భారత్‌తో సహా ఇతర దేశాల పర్యాటక, స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులకు యూకే ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రెండు వీసాల దరఖాస్తుల ఫీజులను పెంచేసింది. స్టూడెంట్ వీసాపై అయితే భారీగా రూ.13,070(127 పౌండ్లు) పెంచింది. ఆరు నెలలలోపు పర్యాటక వీసాకు దరఖాస్తు ఫీజును రూ.1,543(15 పౌండ్లు) పెంచుతూ అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది. పెంచిన కొత్త ఫీజులు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని యూకే విదేశాంగ శాఖ పేర్కొన్నది. తాజా పెంపు తర్వాత ఆరు నెలల లోపు యూకే విజిట్ వీసా దరఖాస్తు రుసుం రూ.11,835(115 పౌండ్లు)కు, స్టూడెంట్ వీసా ఫీజు రూ.50,428(490 పౌండ్లు) చేరిందని తెలిపింది. హెల్త్, కేర్ వీసాలను కూడా పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

