HomeNationalThe Central Government Has Extended The Budget Session Of The Parliament Till 10th Of This Month
పార్లమెంట్ సమావేశాలు 10 వరకు పొడిగింపు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు వాస్తవానికి ఈ నెల 8తో ముగియాల్సి ఉన్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు వాస్తవానికి ఈ నెల 8తో ముగియాల్సి ఉన్నది. అయితే సమావేశాలను మరో రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం తెలిపారు.
2014కి ముందు, ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను పోల్చి శ్వేతపత్రం విడుదల చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.