రాష్ట్ర రహదారులపై ‘టోల్’ ఒలుచుకొంటాం
రాష్ర్టాల్లోని రహదారులను స్వాధీనం చేసుకొని టోల్ వసూలు చేసుకోవటానికి కేంద్రం సిద్ధమవుతున్నది. రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారులను తీసుకొని, విస్తరించి, టోల్ విధిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ముంబై, అక్టోబర్ 16: రాష్ర్టాల్లోని రహదారులను స్వాధీనం చేసుకొని టోల్ వసూలు చేసుకోవటానికి కేంద్రం సిద్ధమవుతున్నది. రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారులను తీసుకొని, విస్తరించి, టోల్ విధిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆ రోడ్లను 4-6 వరుసల రోడ్లుగా అభివృద్ధి చేసి, 25 ఏండ్ల పాటు తమ ఆధీనంలోనే ఉంచుకొంటామని వెల్లడించారు. రోడ్ల అభివృద్ధికి పెట్టిన పెట్టుబడిని వసూలు చేసుకోవటానికే టోల్ను విధిస్తామని వివరించారు.
అసోసియేషన్ ఫర్ నేషనల్ ఎక్సేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ 12 అంతర్జాతీయ కన్వెన్షన్లో ఆదివారం ఆయన వర్చువల్గా మాట్లాడారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త తరహా మోడల్స్ను ఫైనాన్షియల్ మార్కెట్లు కోరుకొంటున్నాయని, వాటి అభివృద్ధికి పీపీపీ విధానంలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఏయే రాష్ర్టాలతో చర్చలు జరిపారు? రద్దీ రోడ్లను స్వాధీనం చేసుకొని ఎన్ని నిధులు కేటాయిస్తారు? పీపీపీ భాగస్వామ్యమా? అన్న విషయాలు గడ్కరీ వెల్లడించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

