Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Rahul Gandhi | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి నవంబర్ 1న రామ్‌లీలా మైదానం (Ramlila Maidan) వరకు ర్యాలీ నిర్వహించతలపెట్టింది. అయితే ఈ ర్యాలీపై అధికార కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.
Rahul Gandhi : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి నవంబర్ 1న రామ్‌లీలా మైదానం (Ramlila Maidan) వరకు ర్యాలీ నిర్వహించతలపెట్టింది. అయితే ఈ ర్యాలీపై అధికార కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ర్యాలీకి ప్రతిపక్ష కూటమి నేతలకంటే ఎక్కువగా బీజేపీ (BJP), దాని మిత్రపక్షాల నేతలే ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమ ర్యాలీకి ఇంత ఉత్సాహంతో పెద్దఎత్తున పబ్లిసిటీ చేస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు రాహుల్‌గాంధీ తెలిపారు. రాబోయే 7 రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించాలని వ్యంగ్యంగా అన్నారు. మరోవైపు నవంబర్ 1న నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనాలని విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజల ఓట్లను దొంగిలిస్తున్నారని, ఈ అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, మౌనంగా ఉండబోమని రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించి, నియమ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీలు ప్రయోగించారని, వాటన్నిటికీ ఇప్పుడు దేశం ప్రతిస్పందిస్తోందని అన్నారు. అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు రావాలని, ఓటు మీదే.. పోరాటం కూడా మీదేనని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న ర్యాలీలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని పార్టీ ఎంపీలకు సూచించారు. నవంబర్ 1న దేశరాజధానిలో నిర్వహించనున్న ర్యాలీలో దాదాపు 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్రం ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
Errabelli Dayakar Rao | ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం : ఎర్రబెల్లి దయాకర్ రావు
RC 17 | మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. ఆర్సీ 17 పూజా కార్యక్రమాలు ఎప్పుడంటే?
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

