Terrorist hideout busted | ఉగ్రవాదుల రహస్య స్థావరం గుర్తింపు.. ఐఈడీలు, వైర్లెస్ సెట్లు స్వాధీనం
Terrorist hideout busted | ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
శ్రీనగర్: ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. (Terrorist hideout busted) జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం సురాన్‌కోట్‌లోని మర్హోట్ ప్రాంతం సురాన్తల్లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అటవీ ప్రాంతంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించారు.
కాగా, స్టీల్ బకెట్లలో అమర్చిన రెండు ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థాలు (ఐఈడీ)లు, మూడు టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేసిన ఐఈడీలను కనుగొన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సరిహద్దు జిల్లాలో పేలుళ్లు జరుపాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసినట్లు చెప్పారు. అర కిలో నుంచి ఐదు కిలోల బరువుతో పేలేందుకు సిద్ధంగా అమర్చిన ఈ ఐదు ఐఈడీలను అక్కడికక్కడే నియంత్రిత పద్ధతిలో పేల్చి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు ఉగ్రవాదుల రహస్య స్థావరంలో పలు వస్తువులను కూడా గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రెండు వైర్లెస్ సెట్లు, ఐదు యూరియా ప్యాకెట్లు, ఐదు లీటర్ల గ్యాస్ సిలిండర్, ఒక బైనాక్యులర్, మూడు ఉన్ని టోపీలు, మూడు దుప్పట్లు, కొన్ని దుస్తులు, పాత్రలను ఈ స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

