Atal Bihari Vajpayee Park | వాజ్‌పేయి పార్కు పేరును కోకోనట్ పార్కుగా మార్పు.. బీజేపీ ఎలా స్పందించిందంటే?
Atal Bihari Vajpayee Park | మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఉన్న పార్కును (Atal Bihari Vajpayee Park) కోకోనట్ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది.
పాట్నా: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఉన్న పార్కును (Atal Bihari Vajpayee Park) కోకోనట్ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. కంకర్‌బాగ్ ప్రాంతంలో ఉన్న అటల్ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును కోకోనట్ పార్క్‌గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మార్చారు. ఈ పేరు మార్పు సోమవారం నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక శిలాఫలకాన్ని ఆ పార్కులో ఏర్పాటు చేశారు.
కాగా, కంకర్‌బాగ్ ప్రాంతంలో ఉన్న పార్కును గతంలో కొబ్బరి పార్క్‌గా పిలిచేవారు. అయితే 2018 ఆగస్ట్ 16న వాజ్‌పేయి చనిపోగా ఆ పార్కు పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి పార్కుగా నాటి బీహార్ ప్రభుత్వం మార్పు చేసింది. అయితే బీహార్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీ(యూ), ఆర్జేడీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఆ పార్కు పేరును మరోసారి మార్చింది. అటల్ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును పాత పేరైన కోకోనట్ పార్కుగా తిరిగి నామకరం చేసింది. ఈ మేరకు కొత్త శిలాఫలకాన్ని పార్కులో ఏర్పాటు చేశారు. అయితే పార్కు ప్రవేశం వద్ద వాజ్‌పేయి పేరు ఉన్న బోర్డు, లోపల ఉన్న ఆయన విగ్రహంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
మరోవైపు పార్కు పేరు మార్పుపై బీజేపీ మండిపడింది. సీఎం నితీశ్ కుమార్ ఒకవైపు వాజ్‌పేయి స్మారకానికి పూలమాలలు వేయగా మరోవైపు ఆయన మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా ఆ పార్కు పేరును మార్చారని విమర్శించింది. ఇది రెండు నాలుకల ప్రభుత్వమని దుయ్యబట్టింది. అలాగే వాజ్‌పేయి పార్కు పేరును మార్చవద్దని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం .. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లున్న కేంద్ర సంస్థల పేర్లు మార్పు చేయడంపై పలు విమర్శలను ఎదుర్కొంటోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

