Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Rahul gandhi | లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) టాటా గ్రూప్ (TATA Group) కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. టాటా సంస్థను 'నేరపూరితంగా నాశనం' చేస్తున్నారని విమర్శించారు. సంస్థను నాశనం చేస్తున్నా దేశంలోని వ్యాపారవేత్తలు భయంతో నోరు మెదపడంలేదని అన్నారు.
Rahul gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) టాటా గ్రూప్ (TATA Group) కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. టాటా సంస్థను ‘నేరపూరితంగా నాశనం’ చేస్తున్నారని విమర్శించారు. సంస్థను నాశనం చేస్తున్నా దేశంలోని వ్యాపారవేత్తలు భయంతో నోరు మెదపడంలేదని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్ (X)’ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు.
భారతీయ వ్యాపారరంగం మోదీ, అమిత్ షాల ఆటవస్తువు కాదని రాహుల్‌గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షా నేరాలవల్ల అన్యాయమవుతున్న వారికి న్యాయం జరిగేలా తాము చూస్తామని తన పోస్టులో పేర్కొన్నారు. టాటా గ్రూప్‌లో కొంతకాలంగా నడుస్తున్న అంతర్గత వివాదం నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సవాల్ చేశారు.
సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు తీర్మానం చెల్లదని, నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని ఆయన అక్టోబర్ 26న రాసిన లేఖలో ఆరోపించారు. ఈ వివాదం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాహుల్ ఆరోపణలపై బీజేపీ నేత సీఆర్ కేశవన్ స్పందించారు. రాహుల్ గాంధీకి ఆర్థికశాస్త్రంపై అవగాహన లేదని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

